Posted on 2026-08-04 08:26:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని జూలూరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎరువుల బుకింగ్ ప్రక్రియలో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, ఉన్నవారికి కూడా యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రైతులు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదని వ్యవసాయం. ఎరువులు కొనుగోలు చేయడానికి యాప్‌లు, ఆన్‌లైన్ బుకింగ్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదని అన్నారు . ప్రస్తుతం యూరియా బుకింగ్ జరుగుతున్నట్లు ఆగస్టు ఆరో తారీకు నుండి మిగతా కాంప్లెక్స్ ఎరువులు కూడా అలానే బుక్ చేసుకోవాలని వస్తున్న కథనాలను అదునుగా ఎరువుల డీలర్లు రైతులను మరింతగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఇదే అదునుగా వారి గోడౌన్లు ఖాళీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కావున రైతులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ద్వారా నేరుగా ఎరువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు వ్యతిరేకంగా మారుతున్న ఈ విధానాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఉసికల రమేష్ విజ్ఞప్తి చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >