Posted on 2026-08-05 13:09:21
కామారెడ్డి, డైలీ భారత్: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్/గేమింగ్ మోసం కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
31-07-2026న రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో బృందాలు సాంకేతిక, డిజిటల్ ఆధారాలతో పాటు నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు @ రొంగలి ముత్యాలు నాయుడు, వయసు 36, ను అరెస్ట్ చేశారు.
మోసం చేసిన తీరు:
నిందితుడు SAT Sports మరియు http://Future9(dot)com అనే వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వాట్సాప్‌లో లింకులు పంపి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని ప్రజలను నమ్మించాడు. బాధితుల పేర్లతో యూజర్ ఐడీలు క్రియేట్ చేసి, UPI, బ్యాంకు ఖాతాలు, QR కోడ్‌ల ద్వారా డబ్బు వసూలు చేశాడు.
పోలీసులు నిందితుడి నుంచి ఒక Apple iPhone ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌లో బెట్టింగ్ వెబ్‌సైట్లకు సంబంధించిన ముఖ్యమైన డిజిటల్ ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ముఠాలో ఇంకా ఉన్న వారి గురించి, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. త్వరలో మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >