Posted on 2024-02-26 19:05:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని బి ఆర్ఎస్ పాలనలో ప్రజలను వేధించిన నాయకులకు తగిన బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కొందరు బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం రోజున మరో రెండు పథకాలు గృహ జ్యోతి, గృహలక్ష్మి అమలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సబ్బండా వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్,నెరల్లా నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం తదితరులున్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >