Posted on 2024-02-26 20:11:28
డైలీ భారత్, మహబూబాబాద్: ఆర్థిక వ్యవహారాలలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు.
సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన పోస్టర్లను, పుస్తకాలను జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్థిక వ్యవహారాలపై ప్రజల్లో చైతన్యం అవసరమన్నారు.
అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత అవసరమన్నారు.
బ్యాంకు లావాదేవీల పట్ల నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని అందుకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకొని రుణాలపై విస్తృత అవగాహన పొందాలని సూచించారు.
రుణాలపై అవగాహన లేకుండా పొందకూడదన్నారు.
ప్రజలు కూడా తమ సొమ్మును కూడబెట్టుకోవడంతోపాటు పెంపొందించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్థిరాస్తుల కోసం ఉన్నత విద్య కోసం రుణాలు పొందవచ్చునని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి డి ఆర్ డి ఎ పిడి పురుషోత్తం, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు బీసీ వెల్ఫేర్ నరసింహస్వామి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >