Posted on 2023-10-26 17:45:28
డైలీ భారత్, అయోధ్య: శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.
వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని… అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.
రాంలాలా ప్రతిష్ట ఎప్పుడంటే..
2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >