| Daily భారత్
Logo




బతుకమ్మ చీరలతో బతికిందేవరు : జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

News

Posted on 2023-10-28 16:57:20

Share: Share


బతుకమ్మ చీరలతో బతికిందేవరు : జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

కేటీఆర్ పద్మశాలిలకు చేసిందేమీ లేదు

ఉన్న సాంచాలు అమ్ముకున్నమని ఎద్దేవా

పద్మశాలీలనే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని హెచ్చరిక,

జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్

డైలీ భారత్, సిరిసిల్ల: బతుకమ్మ చీరల తయారితో సిరిసిల్ల పద్మశాలి బతకటం లేదని, మంత్రి కేటీఆర్ పద్మశాలి సామాజిక వర్గానికి చేసిందేమీ లేదని జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొండ ప్రతాప్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆసాములతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో సాంచాలపై కాటన్, పాలిస్టర్ వస్త్రాలు నడిచినప్పుడు కొత్త సాంచాలు తెచ్చుకొని ఉపాధి పొందే వాళ్ళమని, బతుకమ్మ చీరలలో పదిమంది ఆసాములు మాత్రమే బాగుపడ్డరన్నారు. ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వందల మంది ఆసాములు ఉన్న సాంచాలను పగులగొట్టి అమ్ముకొని రోడ్డుమీద పడ్డారన్నారు. యారాన్ డిపో తెస్తానని ఇంతవరకు తీసుకురాకపోవడంతో మధ్య దళారులు ఎక్కువయ్యారన్నారు. బ్యాంకుల్లో లోన్ ఇస్తామని ఇప్పించలేదని, కాటన్ పరిశ్రమలో డైయింగులు, సైజింగులు పూర్తిగా ముతబడ్డాయని, కాటన్ నడుపుకుందమన్న అదికూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పద్మశాలీల బతుకులు మార్చామని చెప్పుకుంటున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పద్మశాలీలకు చేసిందేమీ లేదన్నారు. బతుకమ్మ చీరలతో సంవత్సరం పాటు ఉపాధి కల్పిస్తానన్న కేటీఆర్, కేవలం మూడు నెలల ఉపాధి కల్పిస్తూ కార్మికులను, ఆసాములను రోడ్డున పడేశారన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో మెరుపు పర్యటనలు చేస్తున్నారని, కనీసం పద్మశాలీలను కలిసి పద్మశాలీల సమస్యలు విన్న పాపాన పోలేదన్నారు. స్పిన్నింగ్ మిల్ వల్ల నేతన్నలకు ఉపాధి దొరికేదని, దానిని కూడా ప్రభుత్వం అమ్ముకుందన్నారు. సిరిసిల్లలో పద్మశాలిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే పద్మశాలీలకు, బీసీలకు న్యాయం జరుగుతుందని, పార్టీలు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్టు ఇవ్వాలని, లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆసాములు కస్తూరి రవీందర్, వల్లకట్ల భూమేష్, గోనె పరశురాములు, సబ్బని బాలయ్య, బోలి వీరేశం, వీరస్వామి, రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >