| Daily భారత్
Logo




బిడ్డకు ప్రాణం పోసిన తల్లి... పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు..

News

Posted on 2024-07-18 10:07:54

Share: Share


బిడ్డకు ప్రాణం పోసిన తల్లి... పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు..

3 ఏళ్ల నూరేళ్ల జీవితం త్యాగం.. అమ్మ నీకు వందనాలు...

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జనరేషన్ లో ప్రతీ మనిషికి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరికైతే బాల్యం నుంచే ప్రాణాంతక వ్యాధులు, అవయవ లోపాలతో పుడుతూ తల్లిదండ్రులకు ఆనందాన్ని దూరం చేస్తున్నారు.

అయితే బిడ్డకు ఏ సమస్య వచ్చినా చూసుకునేది ముఖ్యంగా తల్లే కాబట్టి...ఓ మూడేళ్ల పసివాడికి కన్నతల్లి తన అవయవాన్ని ఇచ్చి ప్రాణదేవతగా మారింది. అయితే నవ మాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోసేది తల్లై అయినా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రతీ మనిషికి పునర్జన్మ ప్రసాదించేది మాత్రం వైద్యులే. తెలంగాణ లోని ఉస్మానియా ఆసుపత్రి  వైద్యులు ఓ మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల పసిబాలుడికి కాలేయం ఇచ్చింది స్వయాన ఆ పిల్లవాడి తల్లే కావడం ఇక్కడ ఇంకో గొప్ప విషయం.

బిడ్డకు ప్రాణం పోసిన తల్లి..

లక్షలు రూపాయల ఫీజులు తీసుకుంటూ రోగుల ప్రాణాల్ని నిలబెట్టలేకపోతున్న కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే వైద్యులే బెటర్ అని మరోసారి రుజువైంది. హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్‌, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది ఉస్మానియా వైద్య బృందం.

పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు..

చోహన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లీకుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రి వైద్యబృందాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >