Posted on 2023-11-05 21:01:17
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీ ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావాల్సిందే
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశం
ముఖ్య అతిథిగా పాల్గొన్న బోయినపల్లి వినోద్ కుమార్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తల్లిదండ్రులు కన్న బిడ్డలను జాగ్రత్తగా సాకినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని తన కన్న బిడ్డల వలే సాకుతున్నారని, ఆ రీతిలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలంటే... మూడవసారి కూడా బి.ఆర్.ఎస్ పార్టీనే గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ భోజన పల్లి వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం సిరిసిల్లలోని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి పక్కాగా అభివృద్ధి బాటలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.
పసి పిల్లలను సాకి పెద్ద జెసి నా విధంగానే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆ విధంగానే ముందుకు నడిపిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని వినోద్ కుమార్ అన్నారు.
ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ, కార్యదర్శి మంజుల, బీ ఆర్ ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >