Posted on 2024-09-06 22:37:01
డీజె లకు అనుమతి లేదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని ఈ. బయ్యారం ఎస్సై పండుగల తిరుపతి సూచించారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.
వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. అనుమతులు పొందిన తరువాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి సమాచారం అయినా 100 కి డయల్ చేయండి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >