Posted on 2024-09-07 00:24:08
అవోపా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అవోపా షాద్ నగర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు .షాద్ నగర్ పట్టణం కే ఎన్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. అందులో బాగంగా కాకతీయ పాఠశాల ఉపాధ్యాయులు నర్మదా,రజిత,సౌజన్య,రాజేశ్వరిలకు సన్మానించిన అవోపా షాద్ నగర్ శాఖ. షాద్ నగర్ అధ్యక్షులు ఎల్కుర్తి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అవోపా రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని మాటల్లో వివరించలేమని తెలిపారు. విద్యార్థి ఉన్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులు అన్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబోధనలో నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యాశాఖలో వివిధ స్థాయిలో పనిచేసిన డిప్యూటీ డిఇఓ ,విశ్రాంత అధికారులు , విశ్రాంతి ఉపాధ్యాయులతో పాటు షాద్ నగర్ నియోజక వర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 178 మంది ఉపాధ్యాయులను శాలువా జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు. దాతలు, కొట్ర శ్రీధర్ పలపట్ల ఆనంద్ బాబు,శ్రీ బి,ఏ,ఎం డిగ్రీ కళాశాల,విజేత జూనియర్ కళాశాల,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకేషనల్ కళాశాల సహకారంతో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అవోపా షాద్నగర్ శాఖ కార్యదర్శి శివ కార్తీక్ కుమార్ , ఆర్థిక కార్యదర్శి ధర్మపురం మనోజ్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సభ్యులు బెజుగం రమేష్,అవోపా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్,అవోపా రాష్ట్ర సెక్రటరీ స్వరాజ్ బాబు, కార్యదర్శి పెండ్యాల జగదీశ్వర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాటి రామచంద్రుడు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యదర్శి గందె సురేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కలువ యాదగిరి, మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సంఘం ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు ఎలుకుర్తి నారాయణ,వాసవి క్లబ్ షాద్నగర్ అధ్యక్షులు గుడిపల్లి వెంకటరమణ,ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎలుకుర్తి జగదిశ్వర్, ఎలుకుర్తి శ్రీనివాస్,యంసాని శ్రీనివాస్, కట్టా ప్రవీణ్, నవీన్ కుమార్, పెద్ది రామ్మోహన్, ఎం.వి.ఎస్ సురేష్,షాద్ నగర్ శాఖ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పెండ్యాల నీరజ వ్యవహరించారు..
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >