| Daily భారత్
Logo




ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

News

Posted on 2024-09-08 19:45:06

Share: Share


ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

డైలీ భారత్, హైదరాబాద్: మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను ఈరోజు తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 26 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు పరిధిలోని ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన షెడ్లు, భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలపర్వం కొనసాగుతుండగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మాదాపూర్ లో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులు

నేడు హైడ్రా అధికారులు మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీనాపూర్ లలో ఏకకాలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారుల తీరుపైన భవన నిర్మాణాలు చేసుకున్న యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని అధికారులను బెదిరించిన ఐదుగురు

దీంతో కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని బెదిరించారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పంటించుకుంటామని... అధికారులను హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీశారు. తాము పిల్లాపాపలతో ఉన్నాం ఎక్కడికి వెళ్లాలంటూ వారు గగ్గోలు పెట్టారు. తమ నివాసాలను కూల్చి వేయకూడదని, అక్కడి నివాసితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పర్మిషన్లు వచ్చాకే ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ వేడుకోలు

తమకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతనే ఇంటి నిర్మాణాలు చేపట్టామని ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం వదిలేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులను, డబ్బున్న వాళ్ళని వదిలేసి పేదవాళ్లపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని వారు అసహనం వ్యక్తం చేశారు.

ఇళ్ళ కూల్చివేతలపై హైడ్రా చెప్తుందిదే.. సామాన్యులు కన్నీరు

మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు ఇటు సామాన్యులకు సైతం షాక్ ఇస్తున్నాయి. అయితే హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నివాసాలు ఏర్పరచుకొని వాటిని కమర్షియల్ గా వినియోగిస్తున్న వాటిపైన చర్యలు తీసుకుంటున్నామని అలాగే కొత్తగా చేపడుతున్న నిర్మాణాలు, నిర్మాణ దశలో ఉన్న వాటిపైనే చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం సామాన్య ప్రజల ఇళ్ళ కూల్చివేతలకు హైడ్రా పాల్పడుతోందని, తమకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >