Posted on 2024-09-09 17:19:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి ఆహ్వానం పలికింది.
ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి కేఎల్ఆర్ తెలిపారు.
వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరులు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయని... దశాబ్దాలుగా వాటి విశిష్ట తగ్గకుండా ఉత్సవ కమిటీ కాపాడుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు కేఎల్ఆర్.
ఈ కార్యక్రమంలో బాలాపూర్ బ్యాంకు చైర్మన్ పెంటారెడ్డి, మహేశ్వరి జయంత్ కుమార్, శశిధర్ రెడ్డి, నర్రారి గౌడ్, సుధాకర్ రెడ్డి, రాఘవరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >