| Daily భారత్
Logo




ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

News

Posted on 2024-09-14 19:46:32

Share: Share


ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

క్షేత్రస్థాయిలో పరిశీలించి పటిష్ఠ ఏర్పాట్లకు ఆధికారులకు తగు ఆదేశాలు జారీ.

డైలీ భారత్, వరంగల్: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలల  ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఆదేశించారు.

శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని పాకాల రోడ్డు లో నూతనంగా నిర్మించిన  నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు ఆధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ... 

నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను ఈనెల 17న ప్రారంభినచనున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ,  జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రెవిన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల  శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి  కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా రానున్నారని తెలిపారు.

50 మంది వైద్య విద్యార్థులకు సరిపడే విధంగా ప్రొఫెసర్లను ఇతర సిబ్బంది నియమించడం జరిగిందని, జిల్లా ఆసుపత్రికి అనుగుణంగా పరికరాలు వైద్యులను నియమించడం దాదాపు పూర్తయిందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎనిమిది నూతన కళాశాలలు వైద్యశాలలో నర్సంపేట ఆసుపత్రికి కళాశాలకు మాత్రమే అవకాశం వచ్చిందని  ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు.

 జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు నియమించిన అధికారులు  ఎలాంటి లోటుపాట్లు లేకుండా తమకు కేటాయించిన విధులను  అంకితభావంతో నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఆసుపత్రి  ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే ఇందిరా మహిళ శక్తి కాంటీన్ ను కలెక్టర్, ఎమ్మెల్యే లు పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే లు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్డీవో కృష్ణవేణి, డీసీపీ రవీందర్, డిఎమ్అండ్ హెచ్ఓ వెంకటరమణ, ఎన్పిడిసిఎల్  ఎస్ఈ మధుసూదనరావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా అధికారులు, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు,  పోలీసు,  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >