Posted on 2024-10-27 13:37:44
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నిన్నటి రోజు రాత్రి విడుదల చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఉపాధ్యాయ సర్దుబాటు లో అనేక రకాల లోపాలు ఉన్నాయని, వాటిని వెంటనే సవరించాలని డి టి ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. నిన్న రాత్రి చాలా ఆలస్యంగా విడుదల చేసిన ఉత్తర్వులలో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 25 మరియు DSE PROC.1267 ఉత్తర్వులను అనుసరించలేదు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ విద్యార్థుల సంఖ్య ఆధారంగా, మొదట గ్రామపంచాయతీ పరిధిలో,
ఆ తర్వాత స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో,
ఆ తర్వాత మండల పరిధిలో,
ఆ తర్వాత పక్క మండల పరిధిలో సీనియర్ కు అవకాశం ఇస్తూ,
సీనియర్ నిరాకరించిన పక్షంలో జూనియర్ ను సర్దుబాటు చేస్తూ జరపాలి కానీ నిన్న రాత్రి విడుదల చేసిన సర్దుబాటు ఉత్తర్వుల్లో వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా, పాఠశాల విద్యార్థుల సంఖ్యను కూడా పట్టించుకోకుండా సర్దుబాటు చేయడం జరిగింది జరిగింది.
ఈ ఉత్తర్వుల వల్ల చాలామంది ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక వేదనకు, బాధకు గురి అవుతున్నారు. అలాగే తగినంత విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఉపాధ్యాయ సర్దుబాటు ఉత్తర్వులను సవరించవలసిందిగా DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. రేపు ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు జిల్లా పరిపాలన అధికారికి ప్రాతినిధ్యం చేయబోతున్నామని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము.
దొంతుల శ్రీహరి,
అధ్యక్షులు,
అవురం సుధాకర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి
DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >