Posted on 2026-04-08 14:27:46
అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు
అమ్మాయిలు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయండి
సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక యువతిని రుద్రంగి కి చెందిన సింగారపు గణేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతు ప్రేమిస్తున్నని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఆ యువతి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గణేష్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ప్రేమ–పెళ్లి పేరుతో వెంటపడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వేధింపులకు గురైన యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >