Posted on 2024-10-28 04:46:03
డైలీ భారత్ ,రంగారెడ్డి జిల్లా:శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. నగరంలో ఎటువంటి సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని చెప్పారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా, అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, నిరసనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారు. ఓకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు సెక్రటేరియట్ ముందు ఆందోళలు చేపట్టారు. ఇక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. మరో 10 మందిని డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనలు ఉద్ధృతం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
దానికి తోడు జన్వాడ పార్టీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బంధువులకు చెందిన ఫాంహౌస్‌లో భారీగా విదేశీ మద్యం పట్టుబటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు వ్యక్తులపై కేసులు నమోదు కాగా.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అది రేవ్ పార్టీ కాదని.. కుటుంబ సభ్యులతో చేసుకుంటున్న దావత్ అని చెబుతున్నారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నేడు నిరసనలకు పిలుపునిచ్చే ప్రమాదం ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని నగరంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >