Posted on 2023-08-29 10:41:32
హైదరాబాద్ : అతి తక్కువ కాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్ అమెరికాను తలపిస్తున్నదంటూ మనసులో మాటను బయటపెడుతున్నారు.
విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇటీవల హైదరాబాద్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరేమిటి ఎందరో సెలబ్రిటీలు హైదరాబాద్‌ను చూసి ఫిదా అవుతున్నారు.
తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ చేరారు. బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాల్ ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాలోనూ మెరిశారు. కడ్తాల్‌లో ఓ ప్రైవేటు డెవలపర్స్ లగ్జరీ విల్లాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌లో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరాభివృద్ధిని చూస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తున్నదని పేర్కొన్నారు.బాలీవుడ్‌లోని పలువురు నటీనటులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపారు.
శంషాబాద్ నుంచి కారులో జూబ్లీహిల్స్ వస్తుంటే విదేశాల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పుకొచ్చారు. దేశంలోని మరే నగరంలోనూ ఇంత భారీ భవనాలు కనిపించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి నిర్మాణాలు, అభివృద్ధి చూస్తుంటే తనకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వస్తున్నదని వివరించారు. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు తరలివస్తున్న విషయం తనకు తెలిసిందని సోనాల్ చౌహాన్ పేర్కొన్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >