Posted on 2024-12-28 12:07:55
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. కేటీఆర్ కు ఇంకా నోటీసులు జారీ చేయలేదు. కానీ ఏసీబీ కేసు ఆధారంగా కేసు పెట్టిన ఈడీ మాత్రం ఆగడంలేదు. వెంటనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈనోటీసులు అందాయి. వీరిని ముందే రావాలని ఆదేశించింది. జనవరి 2, 3 తేదీల్లో వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ.. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కేసు పెట్టింది.
తెలంగాణ ఏసీబీ పెట్టింది అవినీతి కేసు. అక్కడ అవినీతి లేదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈడీ పెట్టింది డబ్బుల అక్రమ తరలింపు కేసు . కేటీఆర్ ఇలా తరలిపోయిందని అంగీకరిస్తున్నారు. అయితే తనకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని ఈడీ తేలుస్తుంది. మొత్తంగా ఏసీబీ కన్నా ఈడీనే దూకుడుగా ఉండటం బీఆర్ఎస్ క్యాంప్‌నకు ఆందోళన కలిగించేదే.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >