Posted on 2025-04-30 11:33:26
- నెలకు లక్ష ఇవ్వాలంటూ ట్రాక్టర్ ఓనర్ కి బెదిరింపులు..
- ఆత్మహత్యే శరణ్యమంటున్న అంజయ్య దంపతులు.
- తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులకు పిర్యాదు..
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల అధ్యక్షుడు మంగీలాల్ నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని జూలూరుపాడు మండలపరిధిలోని బెతాళపాడు గ్రామానికి చెందిన గోపు వెంకటరమణ జూలూరుపాడు పోలీసులను ఆశ్రయించారు
తమకున్న ట్రాక్టర్ తిరగాలన్నా, బేతాళపాడు గ్రామంలోని మిగతా 10 ట్రాక్టర్లు తిరగాలన్నా నెలకు లక్ష రూపాయల చొప్పున మామూలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని గోపు అంజయ్య మంగళవారం మండలకేంద్రంలోని పత్రికా సమావేశంలో ఆరోపించారు. మండలకేంద్రం లోని సీనియర్స్ ప్రెస్క్లబ్ వద్ద మీడియాతో అంజయ్య దంపతులు మాట్లాడుతూ. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మంగీలాల్ వెంట తిరుగుతున్నానని. ఇదే అదునుగా నా ట్రాక్టర్ తిరగాలన్నా నేను పార్టీలో కొనసాగాలన్న నెలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఎటు వెళ్లిన తనకున్న కారు ఇచ్చి పంపించాలని, తన అనుచరులకు తనకు మద్యం బటిల్లు,నాటు కోళ్లు ఇప్పించమని అడిగేవాడని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి, 12 వేల రూపాయలు విలువగల చైర్ ఇప్పించానని, ఎమ్మెల్యే పుట్టినరోజు కార్యక్రమానికి 5000 iరూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీసుకున్నాడని, మండల అధ్యక్షుడు హైదరాబాద్ వెళ్లాలంటే కార్కి డిజిల్ కొట్టించేవాడినని మండల అధ్యక్షుడు సొంత ఖర్చులకు ఫోన్ పే. ద్వారా 5000, 1000, ఇలా ఎంత పడితే అంత డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడని, అవి చాలక ఎక్కువ మొత్తంలో ప్రతి ట్రాక్టర్ కి 10,000 రూపాయలు చొప్పున వసూలు చేసి ఇస్తేనే మీ ట్రాక్టర్లు తిరుగుతాయని లేకుంటే ఏ ఒక్క ట్రాక్టర్ తిరగదని బెదిరిస్తూ ఉండేవాడని, మాట వినకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గోపు అంజయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు..
మండలంలో నేను ఎంత చెప్తే అంత..!
జూలూరుపాడు మండలానికి నేనే ఎమ్మెల్యేనని ఏ పని జరగాలన్నా నాకు తెలిసే జరగాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని నేను చెప్పిందే ఎమ్మెల్యే మంత్రి సహా వింటారని నన్ను కాదని ఏ ట్రాక్టర్ తిరగదు, ఏ వ్యాపారము జరగదు, అలాంటి నాకు నెలసరి మామూళ్లు ఇవ్వాలని, ఎలాంటి అభివృద్ధి జరగలాన్నా నాకు తెలిసే జరగాలని, అందుకే మీ గ్రామం లోని ప్రతి ట్రాక్టర్ మామూళ్లు ఇవ్వాలని వేధింపులకు పాల్పడుతున్నాడని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని లేదంటే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు గతం లో కూడా తమపై కేసులు పెట్టించి ఇబ్బందులగు గురి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు, తమ పై కేసులు పెట్టించినా పట్టించు కునేవారే లేరని తమ కుటుంబానికి ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. న్యాయం కోసం జూలూరుపాడు పోలీసులకు పిర్యాదు చేశామని గోపు అంజయ్య దంపతులు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో. చీపురుగుండె దొర పూర్ణ.. చందర్ రావు, టాక్య తండా యూత్ ప్రెసిడెంట్ శ్రీహరి రావు.. గోరుబంజారా ప్రెసిడెంట్రాంబాబు.. చిరు.. పంతులు తండా యూత్ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >