Posted on 2025-05-03 17:21:13
పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో మహిళా దారుణ హత్య?
డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది,ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రామగిరి మండల పరిధిలోని కల్వచర్ల గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మహిళ తలపై సిమెంట్ ఇటుకలతో కొట్టి హత్య చేశారు.హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ మేరకు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన రామగిరి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం అక్కడున్న ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అయితే, మహిళను సిమెంట్ ఇటుకతో దుండగులు బలంగా కొట్టి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతురాలు మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా రామగిరి పోలీసులు వెల్లడించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >