Posted on 2025-05-18 00:48:57
డైలీ భారత్, మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ అద్వెత్ కుమార్ సింగ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారీ తో కలిసి మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే - 2025 ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన (14) పరీక్ష కేంద్రాల్లో (2539) మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, (1594) రెండవ సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం (4133) మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు.
ఈ మేరకు (14) మంది చీఫ్ సూపరింటెండెంట్లు, (14) మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, (01) అదనపు చీఫ్ సూపరింటెండెంటు, (01) కస్టోడియన్,(1) ఫ్లయింగ్ స్క్వాడ్, (1) ను నియమించామన్నారు.
నిర్దేశించిన మార్గాల ద్వారా ప్రశ్నపత్రాలను ఆయా పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత నడుమ చేరవేయాలన్నారు.
ఆయా పరీక్షా కేంద్రాల్లో నిఘా నేత్రాలను (సీసీ కెమెరాలు) సరిచూసుకోవాలన్నారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది సరిపడా ఔషధ నిల్వలతో కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
ఈ సమన్వయ సమావేశంలో డీ.ఐ.ఈ.ఓ మాధార్, ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ నరేష్, డి.ఎం.హెచ్. ఓ రవి రాథోడ్, మహబూబాబాద్ టౌన్ సి.ఐ పి.సర్వయ్య, జి.సి.జి.డి.ఓ శ్రీరాములు, తొర్రూరు మునిసిపల్ కమిషనర్ శాంతి కుమార్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, పోస్టల్ అధికారి గోపీకృష్ణ, ఆర్టీసీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >