| Daily భారత్
Logo




అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ

News

Posted on 2025-05-24 06:56:19

Share: Share


అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ

డైలీ భారత్, దుబ్బాక: పేగుబంధానికి తలవంపులు తెచ్చే ఘటన ఇది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకోగా.. పసికందు మృతదేహాన్ని గురువారం వెలికి తీశారు. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు అపహరించారని కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపినట్లు అంగీకరించడంతో శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ళ శ్రీమాన్ నంగునూరు మండలం నర్మెట్టకు చెందిన కవితను మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని, అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత రెండు నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవడానికి సిద్ధపడింది. 

భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లి పోవాలని..

ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందును తప్పిస్తే.. భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమార్‌ను తీసుకెళ్లి గ్రామశివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయింది. తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకెళ్లారని చెప్పి, అందరిని తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు. భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని.. అడ్డుగా ఉన్న కుమారుడిని తానే బావిలో వేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కవితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >