Posted on 2025-05-24 12:40:19
డైలీ భారత్, హైదరాబాద్:మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు చేరవేయడమే తప్పా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం లాగ మారిపోయిందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం అని అన్నారు.
గతంలో కేస్ ల తర్వాత ఆయన వైఖరి మారుతుంది అనుకున్నారు.. కానీ మారలేదు. అప్పట్లో ఓటుకు నోటు కుంభకోణం చేస్తే ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు అదే విషయం స్పష్టం అయింది. బీజేపీకి నిజాయితీ ఉంటే.. స్పందించాలి అని కోరారు. అమృత్, సివిల్ సప్లై స్కామ్, యంగ్ ఇండియా, హెచ్ సీయూ భూముల విషయంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తేల్చింది. 10 వేల కోట్ల విషయంలో స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిపోర్ట్ ఇచ్చింది.
సీఎం రేవంత్ 44 వ సారి ఢిల్లీ వెళ్లారు.. నిన్న రాత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కి ఇద్దరు బాసులు ఉన్నారు.. ఒక బాస్ రేవంత్ రెడ్డి అయితే.. మరోబాస్ నరేంద్ర మోడీ, అమిత్ షా లు.. వాళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు.. రేవంత్ రెడ్డి వెంటనే తప్పుకోవాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజీనామా చేయించాలి.. నేషనల్ హెరాల్డ్ కేస్ లో తన పేరు వస్తుంది అనే జపాన్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లారు..
ఇంత ఇంపార్టెంట్ టైం లో దయ్యాలా విషయం ఎందుకు.. ఇప్పుడు తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి.. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలామంది కేసీఆర్ కు ఉత్తరాలు రాశారు.. ఎవరైనా కేసీఆర్ కు ఉత్తరాలు రాయొచ్చు.. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి.. ఎవరైనా సరే అంతర్గతంగా మాట్లాడాలి.. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు.. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు
#ktr
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >