| Daily భారత్
Logo




ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి : టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

News

Posted on 2025-05-29 13:37:22

Share: Share


ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి : టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

ఉపాధ్యాయుల, విద్యా రంగ సంక్షేమానికి టిపిటిఎఫ్ నిరంతర కృషి

ప్రతి సంవత్సరం వేసవిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

రాజ్యాంగ విలువలను పరి రక్షించాలి

టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్ధానిక ZPHS గీతానగర్ ఉన్నత పాఠశాల పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టి.పి.టి.ఎఫ్  ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ, విద్యా రంగ సంక్షేమానికి కట్టుబడి ఉందని దాని కొరకు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. సామాజిక, ఆర్థిక,రాజకీయ దృక్కోణంలో సమస్యలను విశ్లేషించి పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

ప్రభుత్వ విద్యను, పాఠశాలలను కాపాడుకోవడానికి ఫెడరేషన్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు...

ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వాలు మారినప్పుడు విద్యా విధానాలు మారడం నూతనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడం తద్వారా ఉన్నటువంటి ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు సంక్షోభంలోకి నేట్టివేయబడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితులలో విద్యారంగం సంక్షోభంలో ఉందని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తదనంతరం విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని విద్యా ప్రమాణాల పెంపుదలకు ఫెడరేషన్ ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. నిత్య జీవితానికి తరగతి గదినీ జోడించి ప్రయోగాత్మకంగా విద్యను అందించాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులలో శాస్త్రీయ, లౌకిక దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు.

2008 DSC ఉపాధ్యాయులకు జీతం 4 నెలలైనా ఇవ్వలేదని వెంటనే చెల్లించాలన్నారు, .....సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇంతవరకు రాలేదని వారికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా సెలవులలో సర్వే చేసిన కాలానికి సరిపడ CCL లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు..

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య మాట్లాడుతూ TPTF గత 40 సంవత్సరాలుగా విద్యారంగలో సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల ఆర్థిక బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు...

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెండింగ్ లో ఉన్న 5 విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్ రెడ్డి , నూగురి దేవేందర్ , కెవి రజినీరాణి , జిల్లా కార్యదర్శిలు తాళ్లపల్లి శ్రీధర్ మైలారం తిరుపతి చకినాల రామచంద్రం ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు కదిరె శ్రీనివాస్ వేములవాడ అధ్యక్షులు బొజ్జ కృష్ణ తంగళ్ళపల్లి అధ్యక్షులు బండి ఉపేందర్ కోనరావుపేట అధ్యక్షులు కుమార్ ఇల్లంతకుంట ప్రధాన కార్యదర్శి లౌడ్య శ్రీనివాస్ వీర్నపల్లి అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు తంగళ్ళపల్లి ప్రధాన కార్యదర్శి మధుసూదన్ వీరినపల్లి ప్రధాన కార్యదర్శి సుల్తాన్ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట ప్రధాన కార్యదర్శి సతీష్ జిల్లా బాధ్యులు రాంప్రసాద్ భూమేష్ రమేష్ రవిబాబులు పాల్గొన్నారు

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >