| Daily భారత్
Logo




కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళ కానిస్టేబుల్ మృతి

News

Posted on 2025-06-12 13:45:23

Share: Share


కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళ కానిస్టేబుల్ మృతి

డైలీ భారత్, బీహార్: : నిర్లక్ష్యంగా, అతి వేగంగా కారు నడిపిన ఓ డ్రైవర్ ఓ ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. శ్రీకృష్ణపురి ప్రాంతం సమీపంలోని అటల్ పాత్‌పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అటల్ పాత్‌పై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఓ మహిళ కానిస్టేబుల్‌తో కూడిన బృందం ఒక కారును తనిఖీ చేస్తుండగా.. అతి వేగంగా వచ్చిన స్కార్పియో కారు.. పోలీసులు తనిఖీ చేస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

గాయపడిన సిబ్బందిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహిళ కానిస్టేబుల్ మృతి చెందారు. మిగిత ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరార్ అయ్యాడు. వాహనంలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >