| Daily భారత్
Logo




54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం

News

Posted on 2025-06-17 22:19:36

Share: Share


54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం

డైలీ భారత్, వేములవాడ:రోడ్డు వెడల్పు పనుల తొలిదశలో భాగంగా.. స్థానిక పురపాలక సంఘానికి చెందిన మాంసం మార్కెట్ ప్రాంగణాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రధాన రహదారి వెంట ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య సముదాయాన్ని కూల్చగా.. నాలుగు రోజుల్లోగా రహదారికి ఇరువైపులా సేకరించిన భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం ముందు భాగం నుంచి మూలవాగు వంతెన వరకు 144 సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. పనులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి పర్యవేక్షించారు.

వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల వెడల్పును గత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పట్టించుకోకుండా దేవుడినే మోసం చేశారు అని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయని.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చామని వివరించారు. ఈ ప్రాజెక్టు వేములవాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించి.. భక్తులకు, స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని ఆశిస్తున్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >