| Daily భారత్
Logo




ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

News

Posted on 2025-06-22 08:54:12

Share: Share


ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

 శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 

 ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు చేరారు, ఇంకా ఎంత మంది చేరనున్నారు, ఏయే కళాశాలల్లో ఎంత మంది విద్యార్థుల సంఖ్య ఉంది, ఎంత మంది బోధనా సిబ్బంది ఉన్నారు, గురుకులాల్లో గత విద్యా సంవత్సరంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు,  జూనియర్ కళాశాలలకు సమీపంలో ఎన్ని గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, కళాశాలలకు బస్ సౌకర్యాలు ఉన్నాయా అని అధికారులు, ప్రిన్సిపాల్స్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

 ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండాలని అన్నారు.  విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలలకు సమీపంలో ఉన్న హాస్టల్స్ లో ఇంకా సీట్లు పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఏయే కళాశాలల్లో చేరారనే వివరాలను తనకు వారం రోజుల్లో నివేదికను అందజేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. 

ఈ సమావేశంలో  జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకూ 1867 ప్రవేశాల సంఖ్య నమోదైయిందన్నారు. ఇంకా నమోదు శాతం పెరుగుతుందన్నారు.

 ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డిడి నిర్మల, ట్రైబల్ వెల్ఫేర్ డిడి  ప్రేమ కళ, బీసీ వెల్ఫేర్ డిడి లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ ఎం ధరమ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >