| Daily భారత్
Logo




తీరుమారని బడి బస్సు..

News

Posted on 2025-06-22 11:16:51

Share: Share


తీరుమారని బడి బస్సు..

కొరడా ఝల్పిస్తున్న ఆర్టీవో అధికారులు

డైలీ భారత్, కరీంనగర్:అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికీ అనేక సంఖ్యలో బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో కొన్ని 15 సంవత్సరాల కాల పరిమితి దాటినమైనప్పటికీ వాటి యజమానులు రవాణా శాఖ అధికారుల వద్ద డిస్పోజల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికీ పదుల సంఖ్యలో బస్సులు ఫిట్నెస్‌కు రాకుండా మొండికేస్తుండడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు చేస్తూ పాఠశాల బస్సులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం ఉదయం కరీంనగర్ లోని తీగల గుట్టపల్లి వద్ద ఫిట్నెస్ ఇతర పత్రాలు లేకుండా పిల్లలను తరలిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును ఏఎంవీఐ స్రవంతి పట్టుకొని కేసు నమోదు చేసి తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయం తరలించారు. అన్ని పాఠశాలల బస్సులు ఫిట్నెస్ పూర్తయ్యే వరకు తనికీలు నిర్వహిస్తూనే ఉంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >