| Daily భారత్
Logo




వెంటిలేట‌ర్‌పై ఫిష్ వెంక‌ట్‌

News

Posted on 2025-07-02 06:35:12

Share: Share


వెంటిలేట‌ర్‌పై ఫిష్ వెంక‌ట్‌

వెంటిలేట‌ర్‌పై ఫిష్ వెంక‌ట్‌.. సాయం కోసం వేడుకుంటున్న భార్య‌

డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాను, విల‌న్‌గాను నటించి మెప్పించాడు ఫిష్‌ వెంకట్ . మెయిన్‌ విలన్‌ పక్కన ఉంటూ తనదైన తెలంగాణ పంచ్‌లతో అల‌రించేవాడు.అయితే ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏమి బాగుండ‌డం లేదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వెంకట్‌ గతంలో డయాలసిస్‌ తీసుకున్నారు. అప్పట్లో ఆరోగ్యం కొంత మెరుగైనట్లే కనిపించినా, ఇటీవల మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేరు అన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. చికిత్స ఖర్చులు భరించలేక దాతల సహాయం కోరుతోంది. ఆయన భార్య, కూతురు మీడియా ద్వారా “దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి” అంటూ ప్రజలకు, సినీ ప్రముఖులకు వేడుకుంటున్నారు.గతంలో గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకున్న వెంకట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆరోగ్యం విషమించడంతో సాయం అవ‌స‌రమైంది.

వైద్యుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం వెంకట్‌ డయాలసిస్‌పై ఉన్నారు, కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని చెబుతున్నారు. ఇది ఖరీదైన ప్రక్రియ కావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఫిష్ వెంకట్‌ పరిస్థితిని చూసి అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రముఖ హీరోలు, అలాగే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) స్పందించి ఆయనకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలవాలని కోరుతున్నారు. ఫిష్ వెంక‌ట్ “ఆది” చిత్రంలో చెప్పిన “తొడ గొట్టు” డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకుల మ‌దిలో మెదులుతూనే ఉంటుంది. పవన్ కల్యాణ్‌ నటించిన “గబ్బర్ సింగ్” లోనూ తన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు ఫిష్ వెంక‌ట్.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >