| Daily భారత్
Logo




తండ్రిని హత్యచేసిన కేసులో కొడుకు అరెస్ట్

News

Posted on 2025-07-04 18:46:16

Share: Share


తండ్రిని హత్యచేసిన కేసులో కొడుకు అరెస్ట్

భూమి వివాదం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకు.

మోతే పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు. 

నిందితుని అరెస్టు చేసిన మోతే పోలీసులు. 

నరసింహ, ఐ‌పి‌ఎస్ ఎస్పీ సూర్యపేట జిల్లా.

జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

డైలీ భారత్, సూర్యాపేట: ఈనెల 2వ తేదిన మోతే మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న అనే 60 సంవత్సరాల వ్యక్తి విభుళాపురం గ్రామ శివారులో మామిళ్ళగూడెం వెళ్లే రోడ్డు మార్గంలో తీవ్రమైన గాయాలతో రక్తపు గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండగా సమాచారం పై మోతే పోలీసులు అక్కడికి చేరుకుని అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు. దీనిపై మృతుడు వెంకన్న కూతురు స్వరూప ఇచ్చిన ఫిర్యాదు పై మోతే పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారంపై ఉదయం 10 గంటల సమయంలో మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద హత్యకు పాల్పడిన నిందితుడు నిమ్మరబోయిన గంగయ్య ను మోతే SI  యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగినది. 

నింధితుడు : నిమ్మరబోయిన గంగయ్య S/o వెంకన్న వ: 35 సం. వృత్తి: వ్యవసాయం R/o నాగయ్య గూడెం, H/o విభళా పురం గ్రామం, మోతే మండలం.

మృతుడు : నిమ్మరబోయిన వెంకన్న వ: 60 సం.

స్వాదినం : రక్తం మరకలు కలిగిన గొడ్డలి, హెల్మెట్, నింధితుని దుస్తువులు స్వాదినం చేసుకోవడం జరిగినది

నేరవిధానం : నాగయ్యగుడెం గ్రామ శివారులో మృతునికి ఉన్న 4.29 గుంటల భూమి సంబంధిత తగాదా విషయమై తండ్రి కుమారులకు మద్య గత కొద్ది నెలలుగా వివాదం జరుగుతున్నదని ఇదే విషయమై 5 నెలల క్రితం పెద్ద మనుష్యులు సమక్శ్యంలో తీర్మానం ప్రకారం గా మాఅమ్మా, నాన్న లకు 1 ఎకరం భూమి, కుమారులకు  చెరొక 1 ½ ఎకరం భూమి మరియ మా కూతురుకు  29 గుంటల వ్యవసాయ భూమి వాటాలు వేసి ఒక అగ్రిమెంట్ కూడా వ్రాసినారు. ఇట్టి భూమి పట్టాలు చేయలేదు. తరువాత మృతుడు వెంకన్న తన వాటాకు వచ్చిన 1 ఎకరం భూమిని  తనకు అప్పులు అయినాయి  అమ్ముకున్నాడు.  ఈ విషయాలై తండ్రిపై  కోపంతో అతని పై పగ పెంచుకుని అతనిని ఎలాగైనా చంపాలని అని అందుకొరకు అడును చూస్తూ  ఎప్పుడు ఒంటరిగా దొరికితే అప్పుడు అతనిని చంపాలని  నిందితుడు బైక్ పైన  ఎప్పుడు గొడ్డలి పెట్టుకొని  తిరుగుచున్నాను. తేదీ: 02.07.2025 మధ్యాన్నం నింధితుడు నాబైక్ పైన మోతె కు వెళ్ళి తిరిగి మాఇంటికి వస్తు మోతె గ్రామశివారులో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని వస్తుండగా అదే సమయంలో మృతుడు సూర్యాపేట నుండి తన TVS Moped No. TS 29-F-4747 గల దానిపై నాగయ్య గూడెం కు వెళ్ళుచుండడం గమనించి గుర్తుపట్టకుండా నింధితుడు హెల్మెట్ ధరించి మోపెడ్ విభాలాపురం గ్రామ శివారులో వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడిచేశాడు, నింధితుడు అక్కడి నుండి పాయిపోవడం జరిగినది. ఇతనిని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. 

ఈ సమావేశంలో DSP శ్రీధర్ రెడ్డి, మునగాల CI రామకృష్ణ రెడ్డి, మోతే SI యాదవెందర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.

ఈ కేసులో బాగా పనిచేసిన మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ని, ఎస్సై యాదవేంధర్ రెడ్డి ని, మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని కేసు పర్యవేక్షణ చేసిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి నీ జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అభినందించారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >