Posted on 2025-07-12 13:30:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పాపకొల్లు రోడ్డులో గల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థులు నవోదయలో 3సీట్లు సాధించినందుకు శనివారం జూలూరుపాడు మండల విద్యాధికారి జుంకీలాల్ ప్రవేశ పరీక్ష లో విజయం సాధించిన విద్యార్థులను తన కార్యాలయంలో అభినందించారు . నవోదయలో అర్హత సాధించిన వారిలో 1).భరత్ కార్తికేయ* తండ్రి నరసింహారావు ,2)నండ్రు విశ్వ సన్నిధ్* తండ్రి. గురుమూర్తి, 3) కొలిపోక యశ్వంత్,తండ్రి సురేష్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకువచ్చి నవోదయ ప్రవేశ పరీక్షలో విజయం పొందేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయుల ప్రతిభ ఎంతో గొప్పదని ఆయన అభినందించారు .భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం నిర్వహించే పోటీ పరీక్ష లో మరిన్ని విద్యాలయాల్లో సీట్లు సాధించేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయులు,విద్యార్థులకు మరింత సాధన అందించి ఉత్తమ విద్యార్థులను మరింత మందిని తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా విద్యార్థులతో విజయం సాధిస్తూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ ను జిల్లా స్థాయిలో రాణిస్తున్నందుకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మండల ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కు పిల్లలను పంపిన తల్లిదండ్రుల నమ్మకాన్ని మరియు శ్రమతో పిల్లలకు అందుబాటులో ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపించి వారి విలువైన సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఎంత విజయాన్ని సాధించామని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హుస్సేన్ నాగరాజు బండ్ల మధుసూదన్ రావు. కొలిపాక వెంకటేశ్వర్లు బండ్లనరసింహారావు కొలిపాకసురేష్ హలవత్ నరసింహారావు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >