| Daily భారత్
Logo




నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత!

News

Posted on 2025-07-19 07:27:24

Share: Share


నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత!

డైలీ భారత్ద, హైదరాబాద్: టాలీవుడ్ హాస్య నటుడు ఫిష్ వెంకట్ (54) (మంగిలంపల్లి వెంకటేశ్‌) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో లలో విలన్ పాత్రలలోను, అలాగే కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఫిష్ వెంకట్. ముఖ్యంగా ఈయన రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య, కుమార్తె అందరిని వేడుకున్నారు.

తుది శ్వాస విడిచిన ఫిష్ వెంకట్…

ఇక ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలోనే గత కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని తెలుస్తోంది.

ఇలా ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు.

అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని అంత స్థోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు, ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు.

పూర్తిగా క్షీణించిన ఆరోగ్యం… ఇలా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కు సహాయం చేశారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది.

ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా విలన్ పాత్రలలోను కమెడియన్ గా కూడా నటించి మెప్పించారు.

ఫిష్ వెంకట్ మరణం తీరనిలోటు…

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయని తెలుస్తోంది. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు.

ఇలా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల కారణంగానే సరైన చికిత్స తీసుకోలేక ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తుంది. ఫిష్ వెంకట్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి. ఇక ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు తోటి నటీనటులు ఈయన మృతిపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >