Posted on 2025-07-23 10:25:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మంగళవారం రోజున సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆషాడమాస బోనాల సంబరాలను నిర్వహించుకున్నారు.
మనకు ఏ కష్టం వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా , ప్రకృతి వైపరీత్యాల వల్ల అనారోగ్యాలు సంభవించినా, రక్షించమని అమ్మవారికి బోనం రూపంలో భోజనం సమర్పిస్తు వేడుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. ఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ బోనాల పండుగ గురించి మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దని, ముందు తరాల వారికి వాటిని బహుమతిగా ఇవ్వాలని, మన సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలని చెప్పారు. ఈ బోనాల సంబరాల వేడుకల్లో చిన్నారుల పోతరాజు వేషాలు,నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.. పాఠశాల నుండి ప్రారంభం అయిన బోనాలు గ్రామంలో డప్పు చప్పుళ్ళ మధ్య పోతరాజుల ఆటపాటలతో గ్రామ పురవీధులుగుండ తిరుగుతూ మళ్ళీ పాఠశాలకు చేరుకున్నారు..
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కంది సుజాత రెడ్డి, గ్రామ పెద్దలు సూర దేవరాజు, పాతూరి రాజిరెడ్డి,పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పుర ప్రముకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >