| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం...

News

Posted on 2025-07-26 06:11:32

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం...

డైలీ భారత్, యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా... వారిని ఏఎస్పీ ప్రసాద్‌, డ్రైవర్‌ నర్సింగరావుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకన్న స్థానికులు పోలీసులు గాయపడినవారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావులు ఏపీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నారు. వీరు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్కార్పియో వాహనంలో జయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే వారు ఓ కేసు విషయంలో హైదరాబాద్‌కు వస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి...

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించిన ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >