Posted on 2025-07-26 13:34:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలతో పాటు, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. గురుకులంలో 640 మంది విద్యార్థినులు ఉండగా, వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూను పరిశీలించి, తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు, వారికీ అందిస్తున్న పౌష్టికాహారం, నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కింద పనులు పాక్షికంగా చేపట్టి, అర్థాంతరంగా నిలిపి వేయడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >