| Daily భారత్
Logo




కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులు అర్పించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

News

Posted on 2025-07-26 13:34:01

Share: Share


కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులు అర్పించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కార్గిల్ విజయ దివస్ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని కార్గిల్ స్మారక స్తూపాన్ని సందర్శించి, కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతు దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లు మన దేశ గౌరవాన్ని అమరంగా నిలిపారని,వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోలేమన్నారు. దేశ యువతలో దేశభక్తి, సమర్పణ భావన పెంచడానికి కార్గిల్ విజయ దివస్ ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలుస్తుందన్నారు. భారత భూభాగం నుండి కాశ్మీర్ ను వేరు చేయాలని ఉద్దేశంతో ఉగ్రవాద దేశమైన  పాకిస్తాన్ కార్గిల్ జిల్లా పర్వతాల ఆక్రమణను ఆపరేషన్ విజయ పేరుమీద భారత సైన్యం తిప్పికొట్టిన  విజయానికి , మన సైనికులు చూపిన వీరత్వానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ దివస్ ను జరుపుకుంటున్నాం అన్నారు. పార్టీలు, అధికారం వస్తుంటాయి పోతుంటాయి మాకు మా దేశ భద్రతే ముఖ్యం అని భావించి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పెయి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ ఉగ్రవాద దేశానికి ఒక హెచ్చరికగా మారిందన్నారు. ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో 527 మంది వీరుల ప్రాణత్యాగం వృధా పోలేదని వారి యొక్క తెగువను ఆదర్శంగా తీసుకోని మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రదేశానికే కాకుండా భారత్ వైపు చూడాలన్నా శత్రు దేశాలంటీకి ఒక హెచ్చరికను జారీ చేసాం అని అన్నారు. 2014 నుండి బిజెపి అధికారంలో వచ్చాక 370 ఆర్టికల్ రద్దు చేసి,బాంబు పేలుళ్లతో దద్దరిల్లే భూభాగాన్ని సుందర కాశ్మీరుగా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో  అమాయక ప్రజల పైన దాడి చేసిందన్నారు. దేశ ప్రధాని మోదీ సారధ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇద్దరే మహిళలతో పాకిస్థాన్ ఉగ్రదేశానికి చమటలు పట్టించి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన  ఘనత మన భారత సైన్యం, ప్రధాని కి దక్కుతుందన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు ఆనాడు కార్గిల్ యుద్ధంలో మన సైనికుల త్యాగాలు మరువలేదన్నారు. ఆక్రమిత పాకిస్తాన్ ఎల్ ఓ సి ని భారత్ స్వాధీనం చేసుకోవడమే మన లక్ష్యం అన్నారు. ఈ సందర్బంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన రియల్ హీరోస్ అయినా భారత సైనికులను తలుచుకుంటూ వారికీ ఘనమైన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >