| Daily భారత్
Logo




అక్క కళ్ళల్లో సంతోషం కోసం బావను హత్య చేసిన బామ్మర్ది

News

Posted on 2025-07-27 18:04:39

Share: Share


అక్క కళ్ళల్లో సంతోషం కోసం బావను హత్య చేసిన బామ్మర్ది

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో విషాదం

సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని అయిల కుంట వద్ద వెలుగు చూసిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నెల 25న సిరికొండ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై గుర్తు తెలియని వ్యక్తిని తీసుకువచ్చి అటవీ ప్రాంతంలో పారేసిన కేసు మిస్టరీని చేదించారు. అది అనుమానాస్పద మృతదేహం కాదని పక్కా ప్లాన్ తో వైద్యం అందకుండా చేసి చనిపోయిన వ్యక్తిని గుట్టు చప్పుడు కాకుండా అటవీ ప్రాంతంలో పారేసారని ధర్పల్లి సిఐ బిక్షపతి వెల్లడించారు. ఆదివారం ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ కథనం ప్రకారం.. కరీం నగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన ఖాజా మోయినుద్దిన్ ఆర్మూర్ లో ఉంటు సెంట్రింగ్ పనులు చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖాజా మోయినుద్దిన్ తన బావమరిది ఐన లాయిక్ అలియాస్ బబ్లూ వద్ద పనిచేస్తున్నాడు. తరుచు అక్కతో గొడవ పడుతు ఉండటంతో ఖాజా మోయినుద్దిన్ కు అతని బావమరిది బబ్లూ మధ్య గొడవలు జరుగుతున్నాయి. జూలై 23న రామన్నపేట గ్రామంలో సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఖాజా మోయినుద్దిన్ పురుగుల మందు తాగాడు. అతనిని ఆసుపత్రికి తీసుకువెలితే బతుకుతాడు

అతడు చనిపోతే తన అక్క ప్రశాంతంగా ఉంటుందని అతడికి వైద్యం అందకుండా చేసి తన వద్ద పనిచేసే మరో లేబర్ జబ్బార్ తో కలిసి కుట్రకు తెరలేపారు. ఖాజా మోయినుద్దిన్ ను ఆసుపత్రికి తీసుకువేళతున్నట్టుగా బైక్ పై కుర్చుండబెట్టుకుని మైలారం అటవీ ప్రాంతంలోని అయిల కుంట వద్ద పారేసి వచ్చారు. అక్కడ ఉన్న చెట్ల ఆకులతో కప్పిఉంచితే ఎవ్వరికి విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఈ నెల 24న గ్రామస్థులు గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే కొందరు ఇద్దరు వ్యక్తులు వ్యక్తిని బైక్ మధ్యలో తీసుకు వెలుతుకనపించారని విచారణలో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మైలారం ప్రాంతంలో సిసికెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చిన మృతదేహాన్ని  గుర్తించి విచారణ ముమ్మరం చేశారు. భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో బబ్లూతో పాటు జబ్బార్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి మైలారం ప్రాంతంలో సిసి కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు బైక్ పై తీసుకువచ్చిన డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో బబ్లూతో పాటు జబ్బార్ లను అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి సకాలంలో వైద్యం అందకుండా, ఆచూకీ కప్పి ఉంచాలన్న ఉద్దేశంతో చేసిన ఈ దారుణానికి బబ్లూ, అబ్దుల్ జబ్బర్ బాధ్యులని తేలగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్టు సిఐ తెలిపారు. కేసు చేదనలో సిరికొండ ఎస్.ఐ.రామకృష్ణ, సిబ్బందిని అభినంధించారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >