Posted on 2025-07-29 15:21:10
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులపై అలసత్వం వహిస్తే అధికారులకు చర్యలు తప్పవు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క హెచ్చరిక
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: వైద్య ఆరోగ్య,ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు,తాగు సాగునీరు , ఎరువులు విత్తనాలు మరియు వ్యవసాయం, శిశు మహిళా సంక్షేమం. పరిశుభ్రత పచ్చదనం (వన మహోత్సవం) మరియు ఇతర అభివృద్ధి పనులపైజిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన ఇన్చార్జి మంత్రి అనసూయ ( సీతక్క) ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాదులు సోకకుండా కఠినమైన చర్యలు తీసుకుని
జిల్లా లో ఎక్కడైనా అంటువ్యాధులు సోకితే వెంటనే అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి ప్రజలకు సూచన సలహాలు చేయాలన్నారు. వర్ష కాలంలో అంటువ్యాధులు
సోకాకుండా తాగునీటి కొరత ఏర్పడకుండా వాటర్ ట్యాంక్ లు
శుద్ధిచేసి డ్రైనేజీలు వెంట వెంటనే
క్లీన్ చేస్తూ దోమల నివారణ మరియు ఎక్కడైనా వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహణ పై చర్యలు తీసుకోవాలి.అర్హులందరికీ రేషన్ కార్డులు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్లకు ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి
వాటిని పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిధులు మంజూరై ఆరునెలలు గడుస్తున్నా పనులు సక్రమంగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు అభివృద్ధి పనులపై మంజూరైన , టెండర్ల వివరాలను
తెలపాలన్నారు. నిధుల వివరాలు వాటి పురోగతిని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏవైనా పెండింగ్ బిల్లులు ఉంటే తొందరగా పూర్తి చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారుల పై తీవ్రమైన చర్యలు ఉంటాయని, గడువులోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యంగా త్రాగునీరు గోదావరి జలాలు అమృత్ 1 అమృత్ 2 పారిశుధ్యం, రోడ్, డ్రైనేజ్
సెంట్రల్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
శిశు మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
ఇంద్రమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను సరఫరా చేయాలని దాని సరైన పద్ధతిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా రవాణా చేయాలన్నారు. వ్యవసాయానికి విత్తనాలు మరియు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >