Posted on 2025-07-30 12:38:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్నదానం మహాదానమని అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని నిజామాబాదు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు.బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో నిజామాబాదు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ డాక్టర్ జి. బాబురావ్ జన్మదిన సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఏసీపీ మస్తాన్ అలీ ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ ఆకలితో అలమటించే పేదలకు అన్నప్రసాద కార్యక్రమాలు కడుపు నింపుతాయన్నారు.లయన్స్ క్లబ్ లు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.లయన్స్ జోన్ చైర్మెన్ భూమన్న,లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి,పి.రాఘవేందర్,కోశాధికారి అంకం రాజేందర్, పూర్వాద్యక్షులు శివలింగం,గంగాదాస్, ఉపాద్యక్షులు రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >