Posted on 2025-08-02 12:58:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పేద విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 8,600 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక వెయ్యి 23 గురుకులాలు ఉండగా అందులో ఏ ఒక్క గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులకు మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి కి ప్రాధాన్యత కల్పించకపోవడం వల్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదని, విద్యా వ్యతిరేక పాలన నడుస్తుందని విమర్శించారు ప్రభుత్వ హాస్టళ్లు గురుకుల పాఠశాల హాస్టల్లలో ఇటీవల వందల మంది విద్యార్థులు ఫుట్బాయిజంతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అలాగే ఇదే వాళ్ళ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సాయికుమార్, సూర్య ప్రకాష్, జిల్లా నాయకులు సర్దార్ జెస్ మేర్సింగ్, వంశీ, దీపక్, సాయి తేజ సూర్య తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >