| Daily భారత్
Logo




బతికుండగానే భర్తను పాతిపెట్టాలనుకున్న భార్య ... అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి

News

Posted on 2025-08-02 14:14:05

Share: Share


బతికుండగానే భర్తను పాతిపెట్టాలనుకున్న భార్య ... అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి

డైలీ భారత్, బరేలి: ఇటీవల కాలంలో భర్తలపై భార్యలు.. భార్యలపై భర్తల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న మనస్పర్థలకే దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు. ఒకరినొకరు అడ్డుతొలగించుకోవాలనుకునే వరకు వెళ్తున్నారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి దారుణమైన మరో ఘటనే యూపీలో వెలుగుచూసింది.

బరేలీ జిల్లాలోని ఇజ్జత్ నగర్‌ ప్రాంతానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి సాధన అనే మహిళ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, కుటుంబకలహాల నేపథ్యంలో సాధన తన భర్త రాజీవ్‌ను చంపేయాలనుకుంది. ఇందుకోసం ఆమె తన ఐదుగురి సోదరులతో కలిసి పథకం రచించింది. ఈ క్రమంలో రాజీవ్‌ను బలవంతంగా తన ఇంటి నుంచి తీసుకెళ్లి, అతడిపై కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో అతడి చేతులు, కాళ్లు విరగడంతో పాటు అతన్ని చనిపోయినట్టుగా భావించి సమీప అడవిలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని గమనించటంతో వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అతడు రాజీవ్‌ను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించాడు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన జులై 21న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >