Posted on 2025-08-03 09:39:31
ఆరోగ్య యోగ కేంద్రం ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని వినాయక నగర్, శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.4 లో ఏర్పాటు చేసిన ఆరోగ్య యోగ కేంద్రంను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతు బిజెపి ప్రభుత్వం మోదీ అధికారంలో వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో యోగకు గుర్తింపు వచ్చిందని అన్నారు.
నేటి ఆధునిక జీవనశైలిలో మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ పరిస్థితుల్లో యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందవొచ్చు అన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగకు ఎంతో ప్రాధాన్యత ఉందని అందుకే ఇటువంటి కేంద్రాల స్థాపన ద్వారా ప్రజల ఆరోగ్య అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రతి ఒక్కరు రోజు వారి దినచర్యలో యోగాను అలవరుచుకోవాలని సూచించారు. ఇందూర్‌లో ప్రజలకు యోగతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తూన్నా ఈ ఆరోగ్య యోగ కేంద్రం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ఈ ఆరోగ్య యోగ కేంద్రం ద్వారా స్థానికులకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, మరియు ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నిపుణులైన యోగ గురువుల నేతృత్వంలో ప్రతిరోజూ నిర్వహించనున్న ఈ శిక్షణలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య,లింగం యోగ యోగ గురువులు రంజిత్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు ప్రభాకర్, మఠం పవన్, హరీష్,తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >