| Daily భారత్
Logo




పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్

News

Posted on 2025-08-03 11:52:08

Share: Share


పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్

డైలీ భారత్, హైదరాబాద్:టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోక్సో కేసులో అరెస్టయిన ఘటన సినిమా రంగంలో సంచలనంగా మారింది. గత నెలలో  ఆయన‌పై.. మైనర్ బాలిక‌తో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కృష్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.  కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరారీలోకి వెళ్లిపోయారు. కానీ సాంకేతిక ఆధారాలు – ఫోన్ ట్రాకింగ్, సోషల్ మీడియా లొకేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా అతను బెంగళూరులో తలదాచుకున్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

ఇది ఆయన‌పై వచ్చిన మొదటి కేసు మాత్రమే కాదు. గతంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను మోసం చేసినట్లు, వారి నమ్మించి మెసం చేసినట్లు  ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పుడు అతడిపై సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడంతో, పాత కేసుల పై మళ్లీ విచారణ చేపట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాధిత బాలిక తరఫున కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు బాధితురాలికి మానసిక పరిరక్షణ, కౌన్సిలింగ్, చైల్డ్ వెల్‌ఫేర్ సపోర్ట్ వంటి అన్ని విధాలుగా సహాయంగా ఉంటున్నట్లు సమాచారం.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >