| Daily భారత్
Logo




కలం స్నేహం ద్వారా సాహిత్య చేయడం అభినందనీయం : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

News

Posted on 2025-08-03 13:36:45

Share: Share


కలం స్నేహం ద్వారా సాహిత్య చేయడం అభినందనీయం : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కలం స్నేహం ద్వారా సాహిత్య సేవ చేయడం ఎంతో అభినందనీయమని నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘంలో కలం స్నేహం వ్యవస్థాప అధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్య  ప్రదర్శనతో మంత్రముగ్దల్ని చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలం స్నేహం నిర్వహించిన స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలం స్నేహం ద్వారా చేస్తున్నందుకు హర్షనీయమన్నారు. లలిత కళలను ప్రోత్సహిస్తూ సమాజ సేవను గరపుతున్న  కలం స్నేహాన్ని కొనియాడారు. సమాజాన్ని కలల ద్వారా వికసింపజేస్తున్న కలం స్నేహ అధినేత శ్రీమాన్ గోపాలచార్య కు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి బిఆర్ సుజాత సూర్య రాజ్ లకు కవులను కళాకారులను ఘనంగా సత్కరించారు. సమాజ సేవను సహృదయంతో అవిరాల  కృషి చేస్తున్న మద్దుకూరి సాయిబాబు కు చాలా ప్రోత్సాహక హక్కులను సంగీతం ద్వారా ఒక ఉదాహరణ ద్వారా చూపి సభను ఉర్రూతలూపి ఉత్తేజపరిచి ప్రేరణత్మకంగా నిలవడం జరిగిందన్నారు. ఇలాంటి కళావేదికకు మూల కారకులైన నిర్వాహకులు మాట్లాడుతూ కలలు మానసిక వికాసానికి మానవ వికాసానికి దోహదపడతాయని అటువంటి కలల ద్వారా సమాజాన్ని ముఖ్యంగా మహిళా సాధికారత సాధించేలా ప్రయత్నం చేస్తే సమాజ పురోగతి సాధ్యమని అన్నారు. ఇంతమంది కళాకారులు ముందుకు వచ్చి నిర్వహించిన వేడుకను గురించి ఆయన ప్రశంసించారు. కలం స్నేహ జాతీయ ఉపాధ్యక్షురాలు హరిప్రియ మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం వేదికకు అందించిన వ్యవస్థాపక అధ్యక్షులు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత కాసర్ల నరేష్, విరాట్ శ్రీమన్నారాయణ, తిరుమల చార్య, కళా గోపాల్, శివ నాగమణి, డాక్టర్ హేమలత, ప్రముఖ యోగ నిపుణురాలు డాక్టర్ ఐశ్వర్య కలం స్నేహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా జోయ్ అలుకాస్ వారు ధన్పాల్ సూర్యనారాయణ చేతులమీదుగా స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >