| Daily భారత్
Logo




ఆంధ్ర ప్రదేశ్ లో సోలార్ ప్రాజెక్టులకు వేగంగా అడుగులు - తొలిదశలో 3 లక్షల కనెక్షన్లు

News

Posted on 2025-08-04 07:16:18

Share: Share


ఆంధ్ర ప్రదేశ్ లో సోలార్ ప్రాజెక్టులకు వేగంగా అడుగులు - తొలిదశలో 3 లక్షల కనెక్షన్లు

రాష్ట్రంలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం - పీఎం కుసుమ్‌ పథకం కింద 1185 మెగావాట్ల సౌర ప్రాజెక్టులు

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: ఏపీలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. పీఎం కుసుమ్‌ పథకం ద్వారా 1185 మెగావాట్ల ప్రాజెక్టుల స్థాపనకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికోసం అవసరమైన 5983 ఎకరాల భూములను డిస్కంలు గుర్తించాయి. సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుతో సర్కార్​కి సబ్సిడీ భారం కొంతమేర తగ్గనుంది.

ఆంధ్రప్రదేశ్​లో పీఎం కుసుమ్‌ పథకం కింద ఫీడర్ల వెంట మినీ సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు టెండర్లలో యూనిట్‌కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్‌ చేశారు. ఈ పథకం కింద 1185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కంలు ఈ సంవత్సరం మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. త్వరలో వాటిని గుత్తేదారులకు కేటాయించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టులు పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించింది. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల కేటాయింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వీటి కోసం ఇప్పటికే 5983 ఎకరాల మేర భూముల గుర్తింపు పూర్తైంది.

పీఎం కుసుమ్‌ కింద మొదటిదశలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కోసం 1185 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డీపీఆర్‌లను కేంద్రానికి సర్కార్​ పంపింది. తర్వాత మరో 2 లక్షల కనెక్షన్లకు సరిపడా ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. దశలవారీగా 3725 మెగావాట్ల మేర మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు అందుబాటులోకి తేవాలని సర్కార్ భావిస్తోంది. మొదటిదశలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ పథకం కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు కేంద్రం మెగావాట్‌కు రూ.1.04 కోట్లు రాయితీ కింద అందించనుంది.

ఎస్​పీడీసీఎల్ పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించింది. సీపీడీసీఎల్ పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 1842 ఎకరాలను గుర్తించారు. ఈపీడీసీఎల్ పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా దీనికోసం 1086.5 ఎకరాలు గుర్తించారు.

వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రస్తుతం ఏటా సుమారు రూ.12,000ల కోట్లు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. మినీ సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల సర్కార్​కి సబ్సిడీ భారం కొంతమేర తగ్గనుంది. ప్రస్తుతం డిస్కంలు కరెంట్ కొనుగోలు, నిర్వహణ ఖర్చులు, సరఫరా, పంపిణీ నష్టాలు కలిపి యూనిట్‌కు సగటున ధర ఏడున్నర రూపాయలు అవుతోంది. పీఎం కుసుమ్‌ కింద గరిష్ఠంగా యూనిట్‌కు రూ.3.60 వరకు మాత్రమే గుత్తేదారు సంస్థలు కోట్‌ చేశాయి. ఈ ప్రకారం యూనిట్‌కు రూ.3.90 చొప్పున ప్రభుత్వానికి మిగలనుంది. ఫీడర్‌ దగ్గరే ప్రాజెక్టులు ఉండటం వల్ల సరఫరా నష్టాలు మరింత తగ్గుతాయని అధికారులు పేర్కొంటున్నారు

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >