| Daily భారత్
Logo




ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

News

Posted on 2025-08-04 16:45:54

Share: Share


ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జీజీహెచ్, వైద్య కళాశాలల సందర్శన

రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలలను సందర్శించారు. ముందుగా జీజీహెచ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఒక్కో విభాగం వారీగా అందిస్తున్న వైద్య సేవల గురించి. చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. సదుపాయాల మెరుగుదల కోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ పాలసీకి అనుగుణంగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని హితవు పలికారు. మెరుగైన చికిత్సతో పాటు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, ఆసుపత్రులలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారని ప్రశంసించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలందించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని వైద్యులకు హితవు పలికారు.  

ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వారి మనోభావాలు గౌరవిస్తూ సేవా దృక్పథంతో వైద్య సేవలు 

అందించాలని అన్నారు. చికిత్స వివరాలను రోగి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాలని, తద్వారా వారిలో నమ్మకం పెంపొందించాలని  సూచించారు. 

అనంతరం మెడికల్ కాలేజీ పనితీరుపై ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తో కలిసి సమీక్షించారు. వైద్య విద్యార్థుల శిక్షణలో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాల నిర్వహణపై చైర్మన్ తారిఖ్ అన్సారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్ కు మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్నందున దీని వల్ల రోగులు,. వైద్య విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందేలా చూడాలన్నారు. జీజీహెచ్, మెడికల్ కాలేజీల పనితీరు, నిర్వహణకు సంబంధించి సమగ్ర అంశాలను పొందుపరుస్తూ కమిషన్ కార్యాలయానికి నివేదికలు పంపాలని చైర్మన్ సూచించారు. కాగా, ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను సందర్శించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ లు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.


సమీక్షలో  వివిధ విభాగాల హెచ్ఓడీలు, డాక్టర్లు, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >