| Daily భారత్
Logo




సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లను రద్దు చేయాలి.. కోట శివశంకర్

News

Posted on 2025-08-05 14:01:27

Share: Share


సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లను రద్దు చేయాలి.. కోట శివశంకర్

సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లను రద్దు చేయాలి.. కోట శివశంకర్ డిమాండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నడిబొడ్డున సింగరేణి కార్మికుల కోసం కార్మిక ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థినీలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించే లక్ష్యంతో 1975లో ఏర్పాటు చేయబడిన సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాల రానురాను సింగరేణి మహిళా కళాశాలలో అనుభవజ్ఞులైన ఎయిడెడ్ లెక్చరర్లు సీనియర్లు రిటైర్ అయిపోవడం ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రావడం గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలతో పాటు గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిగ్రీ గురుకులాలను అభివృద్ధి చేయడం తద్వారా సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలు చేరకపోగా లెక్చరర్లు వారి వికృత చేష్టలతో ఇన్చార్జి ప్రిన్సిపల్ చింత శారద వింత పోకడలతో మోనార్కిజంతో సింగరేణి విద్యాసంస్థల ప్రతిష్ట రోజురోజుకీ దెబ్బతింటుందని నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తల్లిదండ్రులు కట్టిన ఫీజులను సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ గత సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ అవినీతి ధ్యేయంగా అవినీతి పరుడుగా 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి తెరలేపి ముందుగానే 9 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇన్చార్జి ప్రిన్సిపాల్ చింతా శారద లెక్చరర్ లకి ముందే అన్ని డిపార్టుమెంటు లక్కీ డబ్బులు ఇచ్చి వేయడం జరిగిందని ఒక లెక్చరర్ సైన్స్ ల్యాబ్ లకు మాత్రమే రెండు వేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని సెమినార్లకి కేవలం గెస్ట్ లకి టీఏడీఏలు మాత్రమే అందించాలని విచ్చలవిడిగా దొంగ బిల్లులు పెట్టుకొని మీటింగ్లను తూతూ మంత్రంగా నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు పెడుతున్నారు ఒక సెమినార్ లో భోజనాల ఖర్చుకు హాస్టల్లో వండించి బయట కొని తెచ్చినామని దొంగ బిల్లులు పెడుతున్నారని కొత్త కోర్సులకు యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్లు వచ్చారని సుమారు 40 మందికి 80,000 రూపాయల భోజనాల ఖర్చు చూపించడం జరిగింది ఇలా నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తల్లిదండ్రులు కట్టిన ఫీజులను మరియు సింగరేణి సొమ్మును వృధా చేయడాని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. దీన్ని విద్యార్థి లోకమంతా మరియు ప్రజా సంఘాలు మేధావులు అన్ని రాజకీయ పార్టీలు అన్ని విద్యార్థి సంఘాలు మేధావి వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది... సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో గతంలో 25 సంవత్సరాల వసంతాలు జరిపినప్పుడు ఒక్కరోజు మాత్రమే గత ప్రిన్సిపాల్ లు నిర్వహించడం జరిగిందని ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక్కరోజు సెలబ్రేషన్ చేస్తే సరిపోతుంది ఎంతో ఘన చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తారీకు ఒక్కరోజు మాత్రమే సింగరేణి పుట్టినరోజు వేడుకలను ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతుందని అలాంటిది సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాల వేడుకలను 50 సంవత్సరాల వసంతోత్సవాలను వరుసగా మూడు రోజులు సెలబ్రేషన్స్ చేసి డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారని దీనిని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన బలరాం ఐ ఆర్ ఎస్ మరియు సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ డైరెక్టర్ పా గారు యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గౌతమ్ పోట్ర వెంటనేగోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను రద్దు చేయాలని ఈ 50 సంవత్సరాల వసంతోత్సవాల పై లోతైన విచారణ విజిలెన్స్ విచారణ నిర్వహించి వెంటనే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని రద్దు చేయాలని దీనికి బదులు గత పది సంవత్సరాల నుంచి నాక్ కమిటీకి వెళ్లలేదు కాబట్టి నాక్ కమిటీకి వెళ్లాలని వెంటనే 50 వసంతోత్సవాలను రద్దుచేసి సింగరేణి సొమ్మును వృధా చేయకుండా సింగరేణి కార్మికుల సొమ్మును వృధా చేయకుండా కాపాడాలని వెంటనే ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా చింత శారదను బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది...

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >