| Daily భారత్
Logo




ఎస్సార్ కళాశాలలో విద్యార్థిని లైంగిక వేధింపు పై డి ఐ ఈ ఓ సమగ్ర విచారణ

News

Posted on 2025-08-05 16:36:39

Share: Share


ఎస్సార్ కళాశాలలో విద్యార్థిని లైంగిక వేధింపు పై డి ఐ ఈ ఓ సమగ్ర విచారణ

ఎస్సార్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

నిందితున్ని  కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యుల డిమాండ్

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నిలుస్తుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సార్ జూనియర్ కళాశాల. సోమవారం వినాయక్ నగర్ లోని ఎస్సార్ కళాశాల మహిళా ఇంటర్ జూనియర్ కళాశాలలో ఓ లెక్చరర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే సదరు నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించగా ఘటనకు గల సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు మంగళవారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ కళాశాలకు చేరుకుని ఘటనకు గల వివరాలను కళాశాల ఇన్చార్జి లను, ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి వివరాలను డీఐఈఓ పరిశీలించి విచారణ చేపట్టి తదుపరి అంశాలను తెలియ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు విద్యార్థినిపై అసభ్యంగా, మానసికంగా లైంగికంగా వేధింపులకు గురిచేసిన సదరు లెక్చరర్ పై పోక్షో కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘ  నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థినికి చెందిన కుటుంబ సభ్యులు కళాశాలకు చేరుకుని తమకు పూర్తి న్యాయం జరిగే వరకూ వదిలే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. దేవాలయాల లాంటి విద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఘోరమైన విషయం అన్నారు. అయితే ఎస్సార్ కళాశాల కు చెందిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు బ్రాంచ్ లో సమస్యలకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గతంలో గంగస్థాన్ లో ఉన్న ఈ కళాశాల కు చెందిన విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ వాతలు పడే విధంగా కొట్టడంతో సదరు తల్లిదండ్రులు అప్పట్లో ఆందోళన సైతం చేశారు. ప్రస్తుతం వినాయక నగర్ లోని ఉన్న ఈ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం పట్ల కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురిచేస్తున్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >