Posted on 2025-08-05 16:38:02
రాజ్యాధికార పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవిలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ లో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్ సమావేశం జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీల రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమ,భూస్వాములు జేఏసీ గా ఏర్పడి, బీసీ ఎస్సీ,ఎస్టీ లను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్నిసాధించుకున్నారని,దాన్ని ఆ రెడ్డి వెలమ లే పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అదే బీసీ ఎస్సీ ఎస్టీ లు ఒక జేఏసీ గా ఏర్పడి, వచ్చిన తెలంగాణ రాష్ట్రం లో బీసీ ఎస్సి ఎస్టీ ల రాజ్యం కోసం ఈ జేఏసీ పని చేస్తుందని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి ది బీసీ వాదం కాదు బీ.సీ జూదం అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ డిల్లీ కి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలని ధ్వజమెత్తారు.42 శాతం బీసీ రిజర్వేషన్ల ను 9వ షెడ్యూల్ లో పెట్టి పార్లమెంట్ లో చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సభ లో ప్రొఫెసర్ డా.కుమారస్వామి, దాసోజు లలిత వివిధ కులాల ప్రతినిధులు 60 కులసంఘాలు, జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు వినోద్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజ్, సుమన్, ప్రేమ్ కుమార్, మహిపాల్, ఆత్మ గౌరవ్ స్థానిక నాయకులు మంజుల యాదవ్, రామా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాస రాజేశ్వర్, బుస్సా శంకర్, సాగర్ చారి, మహిపాల్ యాదవ్, దేగాం యాదా గౌడ్, షేక్ హుస్సేన్, శ్రీనివాసా చారి, నాగేష్ గంగపుత్ర, రేఖ రజక, డా.కేశవులు, రాజేందర్ సింగ్, లింగుస్వామి గోసంగి, రమేష్ రజక తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >