Posted on 2025-08-06 10:21:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోచమ్మ గల్లీ రవితేజ యూత్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మట్టి గణపతి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పెరుగుతున్న కాలుష్యన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు మట్టి గణపతిని పూజించాలని అన్నారు. 54 అడుగులతో తెలంగాణలో అతిపెద్ద మట్టి గణపతి నిర్మిస్తు ఆదర్శంగా నిలుస్తున్న రవితేజ యాత్ సొసైటీని అభినదించారు.
బ్రిటిష్ పరిపాలనలో భారతీయులలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో మొదలైన గణేష్ నవరాత్రులు నేడు హిందువులు జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగగా చిన్న, పెద్ద అందరూ కలిసి జరుపుకోవడం హిందూ ధర్మానికి నిదర్శనం అని అన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను హిందువులు ఉత్సాహంగా నియమ,నిష్టలతో జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దాదన్న గారి విట్టల్ రావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు, కన్వీనర్ కిరణ్,బిజెపి, మాయావర్ సాయిరాం, ఆనంద్, పవన్, పల్నాటి కార్తీక్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >